: సమ్మె విరమించాలని జూడాలకు మంత్రి రాజయ్య విజ్ఞప్తి


గత కొన్నిరోజులుగా విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్న తెలంగాణ జూనియర్ వైద్యులకు ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య విజ్ఞప్తి చేశారు. మానవతా దృక్పథంతో ఆలోచించి సమ్మె విరమించాలని కోరారు. రేపు సాయంత్రం నాలుగు గంటలకు జూనియర్ వైద్యులను చర్చలకు ఆహ్వానించనున్నట్లు వరంగల్ లో మీడియాకు తెలిపారు. తెలంగాణలో ఎలాంటి డెంగీ కేసులు లేవని చెప్పిన రాజయ్య... కేసులపై పరిశీలనకు జిల్లా వైద్యాధికారి ఆధ్వర్యంలో కమిటీ వేస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వైద్యుడు సర్వీస్ చేయాలనే నిబంధన చట్టంలోనే ఉందని మంత్రి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News