: సాలూరులో కొంప ముంచిన బాణాసంచా తయారీ
బాణాసంచా అక్రమ తయారీ కొంపముంచింది. విజయనగరం జిల్లా సాలూరు మండల కేంద్రంలోని చిన్నవీధిలో దీపావళి పండగ పురస్కరించుకుని బాణాసంచా తయారు చేస్తున్న ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు తీవ్రతకు ఏడేళ్ల బాలుడు మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఉలిక్కిపడ్డ స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, వారి పరిస్థతి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మరింత మెరుగైన చికిత్స కోసం విశాఖలోని కేజీహెచ్ కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.