: పోర్టులు స్పందించాయి
హుదూద్ తుపాను ధాటికి రూపురేఖలు మారిపోయిన నగరాల పునర్నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ లోని పోర్టుల యాజమాన్యాలు స్పందించాయి. బాధితులను ఆదుకునేందుకు తమవంతు సాయంగా ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు ప్రకటించాయి. కృష్ణపట్నం పోర్టు 5 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించగా, కాకినాడ పోర్టు కోటి రూపాయల విరాళం ప్రకటించింది. గంగవరం పోర్టు కోటి రూపాయల వితరణకు సుముఖంగా ఉన్నట్టు తెలిపింది. ఎగుమతి, దిగుమతులతో ప్రభుత్వానికి అధిక ఆదాయం సమకూరుస్తూ, అతి పెద్ద పోర్టుగా పేరొందిన విశాఖపోర్టు 60 లక్షల రూపాయల విరాళం ప్రకటించి గొప్ప మనసు చాటుకుంది.