: రాహుల్ ద్రవిడ్ ను దాటేసిన ధోనీ!
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ను ఓ విషయంలో అధిగమించాడు. స్వదేశీ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న ద్రవిడ్ ను ధోనీ మూడో స్థానానికి నెట్టేశాడు. శుక్రవారం వెస్టిండీస్ తో జరిగిన నాలుగో వన్డేలో ఆరు పరుగుల వద్ద రనౌట్ అయిన ధోనీ, ఇప్పటిదాకా స్వదేశంలో 3,407 పరుగులు చేశాడు. తద్వారా స్వదేశంలో 3,406 పరుగులు చేసిన ద్రవిడ్, ఈ జాబితాలో మూడో స్థానానికి పడిపోగా, ధోనీ రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, 6,976 పరుగులతో ధోనీకి అందనంత ఎత్తులో ఉన్నాడు.