: క్రికెటర్లు దలైలామా మాటవిన్నారు
టీమిండియా, వెస్టిండీస్ క్రికెటర్లు ధర్మశాలలో జరిగిన వన్డే సందర్భంగా ప్రముఖ ఆథ్యాత్మిక గురువు, ప్రపంచ శాంతి దూత దలైలామాను కలుసుకున్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టేడియంలో దలైలామా ఆశీస్సులు తీసుకున్నారు. లామాను కలిసిన సందర్భంగా క్రీడాకారుల్లో భక్తిభావం కనిపించింది. విండీస్, భారత క్రికెటర్లను దలైలామా ఆశీర్వదించారు. రెండుదేశాల క్రికెటర్లతో ముచ్చటించిన దలైలామా తమ తమ దేశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఉత్తమమైన ఆటతీరుతో ప్రజల ఆదరాభిమానాలు సంపాదించుకోవాలని సూచించారు.