: పేదల జీవితాలతో ఆడుకునే వైద్యుల చేతులు నరికేస్తా: బీహార్ సీఎం
బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. మొన్నటికి మొన్న, ఆలయాల్లో దళితుడినైన తనను అవమానించారని స్వయంగా మీడియా ముందుకు వచ్చిన ఆయన తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పేద ప్రజల జీవితాలతో ఆడుకునే వైద్యుల చేతులు నరికేస్తానని మాంఝీ హెచ్చరించారు. శుక్రవారం మోతిహరిలో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగని ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాట్నా మెడికల్ కాలేజీ సూపరింటెండెట్ పై చర్యలు తీసుకున్న వైనాన్ని కూడా మాంఝీ ఈ సందర్భంగా ప్రస్తావించారు.