: సహచరులను మించిన ఎంపీ జయదేవ్... కోటీ 25 లక్షల విరాళం
హుదూద్ తుపాను బాధితులకు భూరి విరాళం ప్రకటించడంలో టీడీపీ ఎంపీ జయదేవ్ తన సహచరులను మించిపోయారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కు చెందిన అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తరపున కోటి రూపాయల విరాళం ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రకటించారు. అలాగే ఎంపీ ల్యాడ్స్ నుంచి 25 లక్షల రూపాయలు, రెండు నెలల జీతాన్ని ఆయన విరాళంగా అందజేయనున్నట్టు తెలిపారు.