: సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి: రవిశంకర్ ప్రసాద్
గడచిన పదేళ్లలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయని కేంద్ర టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, 2004లో కేవలం 23 సైబర్ నేరాలు నమోదు కాగా, 2013 నాటికి వాటి సంఖ్య అమాంతం 72,000లకు పెరిగిందని చెప్పారు. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (సీఈఆర్టీ) లెక్కల ప్రకారం 2014లోని మొదటి ఐదు నెలల్లో 62,189 కేసులు నమోదయ్యాయని వారు తెలిపారు. ఇంటర్నెట్ వినియోగం విస్తృతమవుతుండడంతో సైబర్ భద్రతను మరింత పెంచాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా పరిశోధనలు జరగాలని ఆయన సూచించారు. సైబర్ నేరగాళ్లకు కఠిన శిక్షలు విధించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.