: జయలలిత తప్పు చేయలేదని నిరూపిస్తే మీసం తీసేస్తా: విజయకాంత్
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత తప్పు చేయలేదని నిరూపిస్తే ఒకపక్క మీసం తీసేస్తానని డీఎండీకే అధినేత విజయకాంత్ సవాలు విసిరారు. రిషివదియం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ, తాను బతకడం కోసం రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. కష్టపడి పని చేసి ప్రజలకు మంచి చేయడానికి వచ్చానని తెలిపారు. తమిళనాట పాలకులు ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారని ఆయన విమర్శించారు. పాలకుల తప్పుల్ని ఎత్తి చూపాల్సిన బాధ్యత, విమర్శించే హక్కు ప్రతిపక్షాలకు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ప్రజల ఆస్తులు దోచుకున్న వారికి తగిని శాస్తి జరిగిందని ఆయన పేర్కొన్నారు. పోలీసు శాఖ మనస్సాక్షితో వ్యవహరించాలని ఆయన సూచించారు. చట్టాలు చేతిలో పెట్టుకుని ప్రతిపక్షాలను ఇబ్బందుల పాటు చేయకూడదని ఆయన హితవు పలికారు.