: సెల్ ఫోన్ చార్జర్ కోసం చంపేశాడు
సెల్ ఫోన్ చార్జర్ ఇద్దరి మధ్య వివాదం రేపి, ఒకరి ప్రాణాలు బలిగొంది. ఢిల్లీలోని రాన్ హొల్లా ప్రాంతంలో 12 తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు సెల్ ఫోన్ చార్జర్ విషయంలో ఘర్షణపడ్డారు. ఈ ఘర్షణలో ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే అతడ్ని సహవిద్యార్ధులు దీనదయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు మృతి చెందాడని నిర్థారించారు. మరో విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.