: విండీస్ స్థానంలో శ్రీలంక... బీసీసీఐ ఐదు వన్డేల ఆఫర్ కు ఓకే
భారత పర్యటనను మధ్యలోనే ముగించుకుని పోవాలని దక్షిణాఫ్రికా జట్టు నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆ స్థానంలో బీసీసీఐ శ్రీలంకను తీసుకుంటోంది. ఈ మేరకు భారత్ తో ఆడేందుకు బీసీసీఐ చేసిన ఐదు వన్డేల ఆఫర్ ను లంక బోర్డు అంగీకరించింది. ఈ మేరకు లంక క్రికెట్ చీఫ్ నిశాంత రణతుంగ ఈ విషయాన్ని ధృవీకరించారు. బీసీసీఐ చేసిన ఆఫర్ ను 'సూత్రప్రాయంగా' అంగీకరించినట్లు చెప్పారు. నవంబర్ 1 నుంచి 15 వరకు ఐదు వన్డేలు జరగనున్నాయి.