: యాదగిరిగుట్టను తిరుపతిలా అభివృద్ధి చేస్తా: కేసీఆర్
యాదగిరిగుట్టను తిరుపతిలా అభివృద్ధి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. యాదగిరిగుట్టలో ఆయన మాట్లాడుతూ, రెండేళ్లలో దీనిని టీటీడీ తరహా టెంపుల్ సిటీగా మారుస్తామని అన్నారు. రెండు వేల ఎకరాల్లో ఉద్యానవనాలు, కళ్యాణ మండపాలు, కాటేజీలు ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. గుట్టకింద చెరువులు, గుట్టలు కలిపి మొత్తం 400 ఎకరాల్లో అభయారణ్యం ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు. యాదగిరిగుట్టలో జరిగే బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పించే సంప్రదాయం అనుసరిస్తామని ఆయన పేర్కొన్నారు. వాటర్ గ్రిడ్ ద్వారా మంచినీటి సరఫరా జరుగుతుందని ఆయన తెలిపారు. హైదరాబాదులోని కార్పొరేట్ సంస్థలన్నీ యాదగిరిగుట్టను టీటీడీ తరహాలో అభివృద్ధి చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిస్తామని కేసీఆర్ చెప్పారు.