: అతిపెద్ద స్కూటర్ల తయారీ యూనిట్ ను గుజరాత్ లో ఏర్పాటు చేస్తున్న హోండా
జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం హోండా ప్రపంచంలోనే అతిపెద్ద స్కూటర్ల తయారీ యూనిట్ ను గుజరాత్ లో స్థాపించనుంది. అహ్మదాబాద్ సమీపంలోని విఠల్ పూర్ వద్ద ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్ కోసం హోండా వచ్చే కొన్ని నెలల్లో రూ.1100 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. 250 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్ కు గురువారం నాడు శంకుస్థాపన చేశారు. 2015 చివరి నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని హోండా భావిస్తోంది. సంవత్సరానికి 12 లక్షల స్కూటర్లు తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.