: ఖమ్మంలో చిన్నారి శ్రీజను కలసిన పవన్


ఖమ్మంలో చిన్నారి శ్రీజ (13)ను సినీ నటుడు పవన్ కల్యాణ్ పరామర్శించారు. తనను చూడాలనుకుంటున్న ఆమె కోరికను నెరవేర్చారు. ఈ సందర్భంగా రూ.2 లక్షల చెక్కును, బొమ్మలను ఆమెకు అందించారు. చిన్నారి కుటుంబసభ్యులను కూడా ఆయన పరామర్శించారు. ఈ సమయంలో పవన్ అభిమానులు భారీగా తరలివచ్చారు. దాంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. మెనెంజైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న ఆ బాలిక ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో ఆ చిన్నారి కోరికను 'మేక్ ఏ విష్ ఫౌండేషన్' మీడియా ద్వారా తెలపడంతో ఆ చిన్నారి కోరికను తీర్చడానికి పవన్ ముందుకు వచ్చారు.

  • Loading...

More Telugu News