: బెయిల్ తో జయ భవితవ్యంపై ఆసక్తికర చర్చ


అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల శిక్షకు గురైన దరిమిలా ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన జయలలిత భవితవ్యంపై ప్రస్తుతం ఆసక్తికర చర్చకు తెరలేచింది. జయకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తిరిగి ఆమె సీఎం పీఠం ఎక్కేందుకు మార్గం సుగమమైందని అన్నా డీఎంకే కార్యకర్తలు భావిస్తుండగా, పరప్పన అగ్రహార కోర్టు విధించిన శిక్ష పూర్తిగా రద్దయితేనే, ఆమెకు ఆ అవకాశం దక్కుతుందని న్యాయ నిపుణులు వాదిస్తున్నారు. అవినీతి కేసులో దోషిగా తేలిన వ్యక్తి సీఎం పదవిలో కొనసాగేందుకు రాజ్యాంగం అనుమతించదని కూడా న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఒక్కసారి బెయిల్ లభిస్తే, సీబీఐ ప్రత్యేక కోర్టు విధించిన శిక్షను సవాల్ చేసుకునే అవకాశం ఉంటుందని, త్వరలోనే ఆ శిక్ష కూడా రద్దయ్యే అవకాశం లేకపోలేదని జయ తరఫు న్యాయవాదులు భావిస్తున్నారు. పరప్పన అగ్రహార కోర్టు న్యాయమూర్తి వెలువరించిన తీర్పు ఆధారంగానే జయను నిర్దోషిగా నిరూపిస్తామని కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్నట్లు వినికిడి. అదే జరిగితే, త్వరలోనే జయలలిత తిరిగి తమిళ సీఎం సీటుపై కూర్చోవడం ఖాయంగానే కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News