: జయకు బెయిలు మంజూరు చేసిన సుప్రీంకోర్టు


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆమెకు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. అక్రమాస్తుల కేసులో జయ బెంగళూరులోని జైల్లో గత మూడు వారాలుగా శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 27న బెంగళూరులోని ప్రత్యేక కోర్టు జయను దోషిగా ప్రకటిస్తూ నాలుగేళ్ల జైలు శిక్షను విధించింది. బెయిల్ కోసం ఆమె పెట్టుకున్న పిటిషన్ ను అక్టోబర్ 7న కర్ణాటక హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో, ఆమె సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. జయతో పాటు శిక్ష అనుభవిస్తున్న శశికళ, సుధాకరన్, ఇళవరిసికి కూడా సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

  • Loading...

More Telugu News