: వాళ్ళ రేషన్ కార్డులపైనే కాదు, ఓటర్ కార్డులపైనా బాలీవుడ్ స్టార్లే!


ఉత్తరాఖండ్ లో ప్రభుత్వ ఆదేశాల మేరకు కుటుంబంలోని పెద్ద వయస్కురాలైన మహిళ పేరిటే రేషన్ కార్డు ఇస్తున్నారు. దానిపై సదరు మహిళ ఫొటో ఉండాలి. రూర్కీ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ పథకం కింద సరితా దేవి, ఉషా దేవి, మీనా దేవి రేషన్ కార్డులు పొందారు. అయితే, ఆ కార్డులపై వాళ్ళ ఫొటోల స్థానంలో బాలీవుడ్ తారల ఫొటోలున్నాయి. సరితా దేవి కార్డుపై చనిపోయిన స్మితా పాటిల్ ఫొటో, ఉషా దేవి కార్డుపై కిరణ్ ఖేర్ ఫొటో, మీనా దేవి కార్డుపై సోనాక్షి సిన్హా ఫొటో ఉన్నాయి. వీటిపైనే కాదు, వీరి ఓటర్ కార్డులపైనా సరిగ్గా ఇవే ఫొటోలుండడం ఆశ్చర్యం కలిగించే విషయం. రేషన్ కార్డులను డిజిటలైజ్ చేసే క్రమంలో ఈ ఫొటోల విషయాన్ని గుర్తించారు. వారికి రేషన్ మంజూరు చేసే దుకాణాన్ని సీజ్ చేసి, విచారణకు ఆదేశించామని జిల్లా కలెక్టర్ సెంథిల్ పాండ్యన్ తెలిపారు.

  • Loading...

More Telugu News