: 'పీకే' పోస్టర్ లో ట్రాన్సిస్టర్ తో అనుష్క శర్మ


బాలీవుడ్ లో తాజాగా తెరకెక్కుతున్న 'పీకే' చిత్రం పోస్టర్లు ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. మొదట అమీర్ ఖాన్ తొలి పోస్టర్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు అందాలభామ అనుష్క శర్మ కూడా ట్రాన్సిస్టర్ ధరించి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పోలీస్ డ్రెస్ ధరించి, మెడలో ట్రాన్సిస్టర్ వేసుకున్న ఆమె ఫోటోలు నేడు యూటీవీ మోషన్ పిక్చర్స్ ట్విట్టర్ లో పెట్టింది. అంతేగాక అమీర్, అనుష్క వింత లుక్స్ లో ఉన్న ఫోటోలు కూడా రిలీజ్ చేశారు. దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ రూపొందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 19న విడుదలవనుంది.

  • Loading...

More Telugu News