: హైదరాబాద్ వచ్చిన మనీష్ తివారి
కేంద్రమంత్రి మనీష్ తివారీ శనివారం హైదరాబాదుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ అంశంపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కృషి చేస్తోందన్నారు. సమస్య పరిష్కారానికి మరికొంత సమయం పడుతుందని మనీష్ తెలిపారు. కనుక రాష్ట్రంలోని ఇరుప్రాంతాల నేతలు సంయమనం పాటించాలని ఆయన కోరారు.