: మా ఇంట్లో అందరూ ఐఫోనే వాడతారు: ఎంపీ కవిత


‘మా ఇంట్లో అందరం ఐఫోన్ లనే వాడతాం, ఐపాడ్ లనూ వినియోగిస్తాం’ అని తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. గురువారం అర్ధరాత్రి బేగంపేటలోని ఓ ప్రైవేట్ హోటల్ లో గాడ్జెట్ రష్ ఎక్స్ పో ప్రారంభమైంది. ఈ ఎక్స్ పోను కవిత ప్రారంభించారు. కుమారుడితో కలిసి కార్యక్రమానికి హాజరైన కవిత, కార్యక్రమంలో భాగంగా ఐఫోన్-6ను చేజిక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఐఫోన్ గురించి మాట్లాడుతూ, తమ కుటుంబంలో అందరూ ఐఫోన్ నే వాడతారని, ఐపాడ్ వినియోగం కూడా తమ ఇంటిలో అధికమేనని తెలిపారు. ‘ఐఫోన్ ఎప్పుడూ స్ఫూర్తి కలిగించేదే. డిజైన్ గురించి మాట్లాడేవారి తొలి ఎంపిక ఐఫోనే’అని కవిత వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News