: ఐఫోన్ -6 విక్రయాలు ప్రారంభం
యాపిల్ తాజా స్మార్ట్ ఫోన్ ఐఫోన్-6, 6 ప్లస్ విక్రయాలు గురువారం అర్ధరాత్రి నుంచి భారత్ లో మొదలయ్యాయి. దీంతో గత నెలలో విశ్వవ్యాప్తంగా విడుదలైన ఐఫోన్-6 లను యాపిల్ భారత మార్కెట్ లోకి ప్రవేశపెట్టినట్లైంది. దీపావళి మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని తొలి విడతలోనే యాపిల్ 55 వేల ఐఫోన్ 6 హ్యాండ్ సెట్లను భారత్ కు తరలించినట్లు సమాచారం. ఐఫోన్-6 హ్యాండ్ సెట్లు అందుబాటులోకి వచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా విక్రయాలు ప్రారంభమయ్యాయి. వినియోగదారులు పెద్ద ఎత్తున వీటి కోసం ఎగబడుతున్నారు. యువతతో పాటు వయోవృద్ధులు కూడా పలు ప్రాంతాల్లో ఈ ఫోన్ల కోసం బారులు తీరారు. హైదరాబాద్ లో బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూంలో ఐఫోన్-6 విక్రయాలు గురువారం అర్ధరాత్రి లాంఛనంగా ప్రారంభమయ్యాయి.