: నేడు మిలటరీ అధికారులతో మోడీ భేటీ
ప్రధాని నరేంద్ర మోడీ నేడు మిలటరీ అధికారులతో భేటీ కానున్నారు. ‘ద కంబైన్డ్ కమాండర్స్’ సమావేశం సందర్భంగా ఆయన త్రివిధ దళాలకు చెందిన అధికారులతో సమావేశం అవుతారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వ ప్రాధామ్యాలు, దేశ భద్రత పరిస్థితులపై మోడీ మాట్లాడనున్నారు. పాక్ కాల్పుల విరమణ ఒప్పందాలకు తిలోదకాలిస్తున్న తీరు, చైనా దురాక్రమణలనూ మోడీ ప్రస్తావించనున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సైన్యంతో మోడీ జరపనున్న ముఖాముఖి భేటీపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ లతో పాటు త్రివిధ దళాధిపతులు పాల్గొననున్నారు.