: నేడు జయ పిటిషన్ ను విచారించనున్న సుప్రీంకోర్టు... తమిళనాడులో హై టెన్షన్


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ పిటిషన్ ను నేడు సుప్రీంకోర్టు విచారించనుంది. రూ.65 కోట్ల అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన జయకు బెయిల్ ఇవ్వడానికి కర్ణాటక హైకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో, ఆమె తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ నేడు విచారణకు రానుంది. దీంతోపాటు, జయలలితను చెన్నై సెంట్రల్ జైలుకు తరలించాలని సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. కర్ణాటకలో శాంతిభద్రతలు కాపాడేందుకు జయను చెన్నై తరలించాలని ఓ జర్నలిస్ట్ సుప్రీంలో పిటిషన్ వేశారు. నిబంధనల ప్రకారం ఖైదీలను ఒక జైలు నుంచి మరో జైలుకు తరలించే అవకాశం ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో, ఈ పిటిషన్ ను జయ పిటిషన్ తో కలిపి సుప్రీం నేడు విచారించనుంది. జయ పిటిషన్ పై విచారణ జరగనున్న నేపథ్యంలో, తమిళనాడు ప్రజల్లో హై టెన్షన్ నెలకొంది. జయకు బెయిల్ రావాలని అభిమానులు, కార్యకర్తలు పూజలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News