: భారత్-వెస్టిండీస్ ల మధ్య నాలుగో వన్డే నేడే!


వెస్టిండీస్ తో నాలుగో వన్డేలో విజయం సాధించడం ద్వారా సిరీస్ పై పట్టు బిగించేందుకు టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. భారత్ లో వెస్టిండీస్ పర్యటనలో భాగంగా నాలుగో వన్డే నేడు ధర్మశాలలో జరగనుంది. ఐదు వన్డేల ఈ సిరీస్ లో 1-1తో ఇరు జట్లు సమ ఉజ్జీలుగా ఉన్నాయి. హుదూద్ తుఫాను నేపథ్యంలో విశాఖలో జరగాల్సిన మూడో వన్డే రద్దు కావడంతో ధర్మశాల వన్డే కీలకంగా మారింది. సీరిస్ ను కైవసం చేసుకోవాలంటే గెలిచితీరాల్సిన మ్యాచ్ గా మారిన ధర్మశాల వన్డేలో టీమిండియా చెమటోడ్చేందుకు సిద్ధమైంది. మరోవైపు తొలి వన్డేలో అద్భుతంగా రాణించి, రెండో వన్డేలో చతికిలబడ్డ విండీస్ జట్టు కూడా నేటి వన్డేలో పుంజుకుని సిరీస్ లో ముందంజ వేసేందుకు యత్నిస్తోంది. ఇక ధర్మశాల బౌన్సీ పిచ్ పై ఎవరు ఆధిక్యం సాధిస్తారో నేటి రాత్రికి తేలిపోనుంది.

  • Loading...

More Telugu News