: ప్రతి భారతీయుడు హిందువే: ఆరెస్సెస్


ప్రతి భారతీయుడు హిందువే అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మరోసారి వ్యాఖ్యానించింది. భారతదేశంలో నివసిస్తున్న వారంతా భారతీయులే అని పునరుద్ఘాటించింది. కులం, మతం, ప్రాంతం ప్రామాణికంగా తాము వివక్ష ప్రదర్శించమని తెలిపింది. లక్నోలో జరిగిన 'ఆరెస్సెస్ అఖిల భారతీయ కార్యాకారి మండల్' సమావేశంలో ఆ సంస్థ పబ్లిసిటీ ఇన్ ఛార్జ్ మన్మోహన్ వైద్య ఈ వ్యాఖ్యలు చేశారు. 2012లో కేవలం 1000 మంది మాత్రమే ఆరెస్సెస్ లో చేరారని... ఈ ఏడాది నెలకు 7 వేల మంది చొప్పున చేరుతున్నారని చెప్పారు. ఆరెస్సెస్ కు ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోందని తెలిపారు.

  • Loading...

More Telugu News