: శ్రీజ కోసం నేడు ఖమ్మం వెళుతున్న పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు ఖమ్మం వెళ్లనున్నారు. బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి కారణంగా మృత్యువుతో పోరాడుతున్న చిన్నారి శ్రీజను ఆయన కలుస్తారు. పవన్ కల్యాణ్ ను చూడాలనుందని శ్రీజ కోరిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని 'మేక్ ఏ విష్' స్వచ్ఛంద సంస్థ పవన్ కు తెలిపింది. దీంతో, చిన్నారి కోరికను తీర్చడానికి ఆయన తన షెడ్యూల్ ను పక్కన పెట్టి ఖమ్మం వెళుతున్నారు. మరోవైపు తమ అభిమాన నటుడు ఖమ్మం విచ్చేస్తుండటంతో ఆయన అభిమానుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.