: హైదరాబాద్ మెట్రోతో వేలాది మందికి ఉద్యోగాలు: గాడ్గిల్
హైదరాబాదులో నిర్మిస్తున్న మెట్రోరైల్ ప్రాజెక్టుతో వేలాది మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని ఎల్ అండ్ టీ ఎండీ గాడ్గిల్ తెలిపారు. వరంగల్ నిట్ లో ఆయన టెక్నోజియాన్-2014 కార్యక్రమాన్ని ప్రారంభించారు. మెట్రోరైల్ తో హైదరాబాదులో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. మెట్రోరైల్ ప్రజల ప్రయాణ ఇక్కట్లు తీరుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. తుది దశ పనులు వేగంగా జరుగుతున్నాయని, సాధ్యమైనంత తొందర్లో మెట్రోరైల్ పట్టాలెక్కుతుందని ఆయన తెలిపారు.