: అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఎబోలా గుర్తింపు పరికరాలు ఉంచుతాం: కేంద్రం
దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఎబోలా వైరస్ ను కనుగొనే పరికరాలు ఉంచుతామని కేంద్ర ప్రభుత్వం బాంబే హైకోర్టుకు తెలిపింది. ఎబోలా వైరస్ ను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వాల వద్ద సరైన సౌకర్యాలు లేవంటూ బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై కేంద్రం వివరణ ఇచ్చింది. ముంబై, పూనె, నాగపూర్ సహా దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలకు ఎబోలా వైరస్ ను గుర్తించే స్కానర్లు ఇస్తామని తెలిపింది. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే వారిని బయటికి పంపిస్తామని కేంద్రం స్పష్టం చేసింది.