: ఆర్నెల్లు గడువిచ్చాం... ఈలోగా తవ్వుకుంటే ఆపలేం: 'బొగ్గు' కేసులో సుప్రీంకోర్టు
ఆరునెలల్లో మూసేయాల్సిన బొగ్గు గనుల తవ్వకాల సంస్థలు రోజుకు మూడు నాలుగు రెట్లు తవ్వుకుంటూ మార్కెట్లో బొగ్గును అమ్ముకుంటున్నాయని న్యాయవాది ఎంఎల్ శర్మ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు అధ్యక్షతన ధర్మాసనం తీర్పు చెబుతూ, బొగ్గు కంపెనీలు తమ కార్యకలాపాలు ఆపేసేందుకు ఆరునెలల గడువు ఇచ్చామని, ఈ లోపు వారు తవ్వుకుంటే దానిని ఆపలేమని స్పష్టం చేసింది. ఆ ఆరునెలల గడువులో వారు ఏం చేసినా చెల్లుతుందని, ఆరు నెలల గడువు ముగిశాక తవ్వకాలు జరిపితే కుదరదని న్యాయస్థానం వివరించింది.