: దేశ నూతన ఆర్థిక సలహాదారుగా అరవింద్ సుబ్రమణ్యం


అమెరికాలో వుంటున్న అరవింద్ సుబ్రమణ్యం భారత దేశ ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. వాషింగ్టన్ లోని పీటర్సన్ ఇన్స్టిట్యూట్ లో సీనియర్ అధికారి అయిన ఆయన ఈ మేరకు ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని తెలిపారు. నెల్లాళ్ళ క్రితం అరవింద్ ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ పదవికి సిఫార్సు చేశారు. తాజాగా ఆయనను ఖరారు చేశారు. కాగా, కొత్త ఆర్థిక కార్యదర్శిగా రాజస్థాన్ కు చెందిన అధికారి రాజీవ్ మెహ్రిష్ ను తీసుకున్న ఒకరోజు తర్వాత కొత్త ఆర్థిక సలహాదారు నియమితులవ్వడం గమనార్హం.

  • Loading...

More Telugu News