: 700 కేసులతో పోలీసులను అపహాస్యం చేసిన శివ గ్యాంగ్!


దొంగతనాలు, దోపిడీలు జరిగే తీరును, పోలీసుల ఉదాసీనతను కళ్లకు కట్టే విషయం ఇది. దొంగలను, నేరగాళ్లను అదుపుచేయడంలో తెలుగు రాష్ట్రాల పోలీసుల స్టైలే వేరు అని పోలీస్ బాసులు గొప్పగా చెబుతుంటారు. వారివన్నీ మాటలే తప్ప చేతలు కాదు అనడానికి ఇదే నిదర్శనం. ఇటీవలే ఎన్ కౌంటర్లో హతమైన శివకు చెందిన గ్యాంగు సభ్యులు 700 కేసుల్లో నిందితులట. వీరిని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో దోపిడీ దొంగ శివ భార్య సహా ముగ్గురున్నారు. వారి నుంచి 4.5 లక్షల రూపాయల నగదు, 3.5 కేజీల బంగారం, రెండు కార్లు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరిపై ఉన్న 700 కేసుల్లో 510 కేసులు సైబరాబాద్ పరిధిలోనే ఉన్నాయని పోలీసులు చెప్పారు. దొంగ బంగారం తాకట్టుపెట్టుకున్న ముత్తూట్ ఫైనాన్స్, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ సంస్థల ప్రతినిధులను అరెస్టు చేశామని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News