: గవర్నర్ నరసింహన్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గురువారం మధ్యాహ్నం గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. రాజ్ భవన్ లో వీరి భేటీ జరిగింది. ఏ అంశాల ప్రాతిపదికగా ఈ భేటీ అయ్యారన్న విషయంపై వివరాలు వెల్లడి కాలేదు. రాష్ట్రంలో ఆందోళనకర స్థాయికి చేరిన విద్యుత్ కోతలు, ఆహార భద్రత కార్డుల జారీ తదితర అంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. సాధారణంగా గవర్నర్ తో సీఎం భేటీపై కనీసం ఒక రోజు ముందుగా మీడియాకు సమాచారం ఉంటుంది. అయితే, ఈ భేటీకి సంబంధించి ఎలాంటి ముందస్తు సమాచారం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, భేటీపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.