: నేపాల్ ను తాకిన హుదూద్... 29 మంది మృతి
ఉత్తరాంధ్రను వణికించిన హుదూద్ తుపాను ఉత్తర దిశగా పలు రాష్ట్రాల్లో పయనించి చివరకు నేపాల్ చేరింది. హుదూద్ ప్రభావంతో నేపాల్ లోని వాతావరణ పరిస్థితుల్లో విపరీత మార్పులు సంభవించాయి. అక్కడి మంచుకొండలు కరిగిపోతున్నాయి. దీంతో, 29 మంది మృతి చెందారు. చనిపోయిన వారిలో పర్వతారోహకులతో పాటు పశుపోషకులు కూడా ఉన్నారు.