: విద్యుత్ కోతలను అధిగమించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాం: ఈటెల
రానున్న రోజుల్లో విద్యుత్ సంక్షోభాన్ని అధిగమిస్తామని టీఎస్ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. విద్యుత్ కోతలను అధిగమించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా, బీహెచ్ఈఎల్ తో 6 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. 2017 నాటికి తెలంగాణలో విద్యుత్ కోతలు ఉండవని తెలిపారు. న్యాయబద్ధంగా తెలంగాణకు రావాల్సిన విద్యుత్ ను ఏపీ ప్రభుత్వం ఇవ్వడం లేదని మండిపడ్డారు.