: ఐఐటీ విద్యార్థుల కోసం కొత్త కంపెనీల క్యూ!


కొత్తగా వ్యాపార రంగంలోకి అడుగిడిన కంపెనీలు, ఐఐటీ విద్యార్థులను ఉద్యోగులుగా నియమించుకునేందుకే ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ మేరకు ఐఐటీ క్యాంపస్ ఇంటర్వ్యూల కోసం కాసుకుని కూర్చున్నాయి. గతేడాది కంటే, ఈ దఫా మరిన్ని కొత్త కంపెనీలు ఐఐటీల బాట పట్టనున్నాయని తెలుస్తోంది. గతేడాది ఐఐటీ క్యాంపస్ ఇంటర్వ్యూలకు హాజరైన కంపెనీల సంఖ్యకు రెండింతలు, మూడింతల మేర ఈ దఫా కొత్త కంపెనీలు రానున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. గతేడాది మద్రాస్ ఐఐటీ క్యాంపస్ ఇంటర్వ్యూలకు ఏడు కొత్త కంపెనీలు హాజరైతే, డిసెంబర్ లో జరగనున్న ఈ ఏటి ఇంటర్వ్యూలకు 14 కొత్త కంపెనీలు తమ పేర్లను రిజిష్టర్ చేసుకున్నాయి. డిసెంబర్ నాటికి ఈ సంఖ్య 30కి చేరే అవకాశముందని మద్రాస్ ఐఐటీ అకాడెమిక్ అఫైర్స్ సెక్రటరీ విశ్రాంత్ సురేశ్ చెప్పారు. ఇప్పటికే తమ పేర్లను రిజిష్టర్ చేసుకున్న 14 కంపెనీల్లో 11 కంపెనీలు తమ విద్యార్థులను మాత్రమే నియమించుకోనున్నాయని ఆయన వెల్లడించారు. కాన్పూర్ ఐఐటీలో కూడా ఇప్పటికే 35 కొత్త కంపెనీలు తమ పేర్లను నమోదు చేసుకోగా, డిసెంబర్ నాటికి ఈ సంఖ్య 45కు చేరుకునే అవకాశముందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News