: 2020 నాటికి నైపుణ్యం కలిగిన యువతకు డిమాండ్: మోడీ
ప్రపంచంలో 2020 నాటికల్లా నైపుణ్యం కలిగిన యువతకు డిమాండ్ పెరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. మన యువతకు ఉద్యోగం కావాలని, పారిశ్రామికవేత్తలకు పనిచేసేవారు కావాలని చెప్పారు. కాబట్టి దేశంలో ఐటీఐలను పరిపుష్టం చేయాలని... వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. శ్రమయేవ జయతే పథకం ప్రారంభం అనంతరం ప్రధాని మాట్లాడుతూ, దేశంలో తయారయ్యే ప్రతి వస్తువు వెనుక పేదవాడి శ్రమ ఉంటుందన్నారు. కాబట్టి, శ్రామికులే దేశ నిర్మాతలని పేర్కొన్నారు. కార్మికుల సమస్యలను వారి కోణంలోనే చూడాలని చెప్పారు. వైట్ కాలర్ ఉద్యోగులకు సమాజంలో గౌరవం ఉందని చెప్పిన మోడీ, కూలీలు, కింది స్థాయి ఉద్యోగుల పట్ల ఉన్న దృక్పథాన్ని తాము మారుస్తామన్నారు. ఈ-గవర్నెన్స్ ద్వారానే పారదర్శకత సాధ్యమన్నారు.