: 'శ్రమయేవ జయతే' పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో 'దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ శ్రమయేవ జయతే' పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించారు. అనంతరం 'శ్రమ సువిధ పోర్టల్'ను కూడా ప్రారంభించారు. తరువాత శాశ్వత ఖాతా సంఖ్య, కార్మికుల తనిఖీ పథకాలను కూడా మోడీ ఆరంభించారు. సత్యమేవ జయతే ఎంత శక్తిమంతమో శ్రమయేవ జయతే కూడా అంతే శక్తిమంతమైనదని ఈ సందర్భంగా ప్రధాని చెప్పారు. ఇక శాశ్వత ఖాతా సంఖ్య వల్ల ఉద్యోగి ఎక్కడికి వెళ్లినా అదే సంఖ్య కొనసాగుతుందని తెలిపారు.