: ధర్మశాల పిచ్ మార్చేశామంటున్న క్యూరేటర్... రేపు నాలుగో వన్డే


హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో రేపు భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం పక్కా వన్డే పిచ్ ను సిద్ధం చేశామని క్యూరేటర్ సునీల్ చౌహాన్ తెలిపారు. చివరిసారిగా ఇక్కడ భారత్-ఇంగ్లాండ్ వన్డే మ్యాచ్ జరిగింది. స్వల్ప స్కోర్లు నమోదైన ఆ పోరులో భారత్ ఓటమిపాలైంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని తాము వన్డేలకు అతికినట్టు సరిపోయే పిచ్ ను రూపొందించామని చౌహాన్ వివరించారు. సీమ్ బౌలర్లకు పిచ్ సహకరిస్తుందని, అటు, బ్యాట్ పైకి బంతి చక్కగా వస్తుందని తెలిపారు. వన్డేల్లో ఉపయోగించే కూకబుర్రా బంతి తొలి 5-7 ఓవర్లపాటు బాగా స్వింగ్ అవుతుందని చెప్పారు. ఛాతీ ఎత్తున బౌన్స్ సాధ్యమవుతుందని కూడా చౌహాన్ పేర్కొన్నారు. కాగా, ఐదు వన్డేల సిరీస్ లో తొలి మ్యాచ్ విండీస్ నెగ్గగా, రెండో మ్యాచ్ లో భారత్ జయభేరి మోగించింది. విశాఖ వేదికైన మూడో మ్యాచ్ తుపాను కారణంగా రద్దయింది. దీంతో, ఇరుజట్లు 1-1తో ఉన్నాయి. నాలుగో మ్యాచ్ కు ధర్మశాల ఆతిథ్యమిస్తోంది.

  • Loading...

More Telugu News