: ఓటు హక్కు వినియోగించుకోని బాలీవుడ్ 'సూపర్ సిటిజన్లు'
దేశ ప్రజల గురించి, వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి లోతుగా ఆలోచించే నటులుగా అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ లకు పేరుంది. అవకాశం లభించిన ప్రతిసారి సమాజ హితం కోసం పనిచేసేందుకు వీరు తపిస్తుంటారు. ఓ రకంగా వారిని బాలీవుడ్ సూపర్ సిటిజన్లు అని పిలవొచ్చు. అయితే, బుధవారం నాడు జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరూ తమ ఓటు హక్కును వినియోగించుకోకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. 'బిగ్ బి' ఢిల్లీలో ఓ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడంతో ఓటు వేసే అవకాశాన్ని చేజార్చుకున్నారు. ఇక, అమీర్ ఖాన్ విషయానికొస్తే... ఓ కమిట్ మెంట్ నేపథ్యంలో కేన్స్ లో ఉన్నాడట. అమీర్ భార్య కిరణ్ రావ్ ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఓటేయనందుకు అమీర్ ఎంతో నిరుత్సాహానికి గురయ్యారని తెలిపింది.