: విశాఖలో సీఎం చంద్రబాబును కలసిన పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకున్నారు. తుపాను వల్ల సంభవించిన నష్టం, ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న సాయం తదితర అంశాలపై వీరు చర్చించుకున్నారు. కాగా, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నిన్నటి నుంచి పర్యటిస్తున్న పవన్ బాధితులను పరామర్శిస్తున్న సంగతి తెలిసిందే. నేడు కూడా బాధితుల వద్దకు వెళ్లి మాట్లాడనున్నారు.