: విమానంలో విష సర్పాలు.. వ్యక్తి అరెస్టు


విష సర్పాలను అక్రమ రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని చెన్నై విమానాశ్రయంలో నేడు కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. మహ్మద్ అజారుద్దీన్ అనే వ్యక్తి థాయ్ ఎయిర్ వేస్ విమానం ద్వారా చెన్నై చేరుకున్నాడు. విమానాశ్రయంలో తనిఖీ చేయగా అతని వద్ద ఉన్న సూట్ కేసులో ఐదు భయంకర విష సర్పాలు బయటపడ్డాయి. దీంతో, కస్టమ్స్ వర్గాలు అతన్ని అదుపులోకి తీసుకున్నాయి.

అయితే, థాయ్ లాండ్ లో ఉన్న తన మిత్రుడు ఈ సూట్ కేసును తనకు ఇచ్చాడని, దాన్ని చెన్నైలో ఉన్న ఓ వ్యక్తికి ఇవ్వాలని చెప్పాడని అజారుద్దీన్ వెల్లడించాడు. అందుకోసం రూ. 10 వేలు ముట్టచెప్పాడని కూడా అజారుద్దీన్ తెలిపాడు. కానీ, తనకు ఆ సూట్ కేసులో పాములున్న సంగతి తెలీదని వాపోయాడు. కాగా, అజారుద్దీన్ థాయ్ లాండ్ విమానాశ్రయ భద్రత సిబ్బందిని ఎలా ఏమార్చగలిగాడన్న దానిపై ప్రస్తుతం అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇక, విష సర్పాలున్న సూట్ కేసును కస్టమ్స్ అధికారులు అటవీ శాఖ సిబ్బందికి అప్పగించారు.

  • Loading...

More Telugu News