: చైనా సైబర్ దాడులు పొంచి ఉన్నాయి: అమెరికా పారిశ్రామిక వేత్తలకు ఎఫ్ బీఐ హెచ్చరిక
చైనా రాజధాని బీజింగ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కొన్ని సాఫ్ట్ వేర్ సంస్థల నుంచి సైబర్ దాడులు పొంచి ఉన్నాయని, అప్రమత్తంగా ఉండాలని అమెరికా తన పారిశ్రామిక వేత్తలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) తమ దేశ పారిశ్రామిక వేత్తలను అప్రమత్తం చేసింది. కేవలం అమెరికా సంస్థల కీలక సమాచారాన్ని తస్కరించడమే లక్ష్యంగా బీజింగ్ లో సదరు సంస్థలు వెలిశాయని కూడా ఎఫ్ బీఐ వెల్లడించింది. చైనా ప్రభుత్వ అనుమతితోనే ఆ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని ఎఫ్ బీఐ ఆరోపించింది.