: 11 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్
ఎన్ని చర్యలు తీసుకున్నా ఎర్రచందనం స్మగ్లర్లు మాత్రం వెనకడుగు వేయడం లేదు. పోలీసులకు, అటవీ సిబ్బందికి సవాల్ విసురుతూ... విలువైన సంపదను అక్రమంగా తరలిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో, చిత్తూరు జిల్లా నగరిలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు... అక్రమంగా చెన్నైకి తరలిస్తున్న 31 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన తొమ్మిది మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వారు ప్రయాణిస్తున్న రెండు కార్లను కూడా సీజ్ చేశారు. స్మగ్లర్లపై కేసు నమోదు చేశారు. పుత్తూరులో కూడా 25 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేసి... రెండు కార్లను సీజ్ చేశారు.