: పాక్ మందుపాతరను నిర్వీర్యం చేసిన భారత సైన్యం


జమ్మూకాశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దులో ఉన్న పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ కు చెందిన మందుపాతరను భారత సైన్యం నిర్వీర్యం చేసింది. నియంత్రణ రేఖ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న బలగాలే లక్ష్యంగా ఈ మందుపాతరను పాతిపెట్టి ఉంటారని భావిస్తున్నారు. పెట్రోలింగ్ బలగాలు ఈ క్లైమోర్ మైన్ ను గుర్తించాయి. ల్యాండ్ మైన్ తో పాటు శాలువ, ట్రాక్ సూట్, టోపీలను కూడా స్వాధీనం చేసుకున్నాయి. నియంత్రణ రేఖ వద్ద మందుపాతర లభించడంతో... పాక్ తీవ్రవాదులు తమ చర్యలను తీవ్రతరం చేసినట్టు వెల్లడవుతోందని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News