: నల్లధన వివరాల వెల్లడికి స్విట్జర్లాండ్ అంగీకారం
నల్లధనం వెలికితీతకు సంబంధించి మోడీ సర్కారు చేపడుతున్న చర్యల్లో ఎట్టకేలకు పురోగతి నమోదైంది. తమ దేశ బ్యాంకుల్లో భారత రాజకీయ నేతలతో పాటు వ్యాపార దిగ్గజాలు అక్రమ పద్ధతుల్లో దాచిన అక్రమ సంపాదన వివరాలను వెల్లడించేందుకు స్విట్జర్లాండ్ బుధవారం అంగీకారం తెలిపింది. భారత్, స్విట్జర్లాండ్ ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారుల మధ్య జరిగిన చర్చలు ఈ మేరకు ఫలించాయి. నల్లధనానికి సంబంధించి భారత్ కోరిన వివరాలను నిర్ణీత కాలంలోగా వెల్లడించడంతో పాటు వివరాల వెల్లడికి అడ్డుపడుతున్న కారణాలను కూడా స్విస్ తెలపనుంది. స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న భారతీయుల నల్లధనం వెలికితీత వ్యవహారంపై దేశంలో సుదీర్ఘకాలంగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే.