: ఇకపై అమల్లోకి రానున్న తెలంగాణ వ్యాట్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలైన ఏపీ వ్యాట్ చట్టం 2005ను తెలంగాణ రాష్ట్రానికి అన్వయిస్తూ తెలంగాణ వ్యాట్ గా మార్చారు. ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టానికి అనుగుణంగా వ్యాట్ (విలువ ఆధారిత పన్ను)ను నిర్ధారిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.