: రామాలయ నిర్మాణమే వీహెచ్ పీ లక్ష్యం: తొగాడియా
చాలా ఏళ్లుగా కొనసాగుతున్న వివాదాన్నే మరోమారు తెరపైకి తెచ్చింది విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ). అయోధ్యలో రామమందిర నిర్మాణమే వీహెచ్ పీ ప్రథమ లక్ష్యమని తేల్చి చెప్పింది. మందిర నిర్మాణం కోసం అవసరమైతే చట్టసభల్లో పోరాటానికి కూడా వెనుకాడమని వీహెచ్ పీ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా స్పష్టం చేశారు. కర్ణాటకలోని హుబ్లిలో ఆయన మాట్లాడుతూ, సంస్థను స్థాపించి 50 ఏళ్లు పూర్తయిందని... ఈ సందర్భంగా నవంబర్ 21 నుంచి మూడు రోజుల పాటు దేశ వ్యాప్తంగా శోభాయాత్ర నిర్వహిస్తామని తెలిపారు.