: విశాఖలో రెండు రోజులపాటు బాలకృష్ణ పర్యటన


టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ రెండు రోజులపాటు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ సాయంత్రం ఆయన విశాఖ బయలుదేరనున్నారు. ఇప్పటికే ఆయన తుపాను బాధితుల సహాయార్థం రూ. 30 లక్షల విరాళం ప్రకటించారు. దీంతోపాటు, 20 టన్నుల బియ్యం, మందులు అందజేస్తానని చెప్పారు. తుపాను సహాయక చర్యల్లో తన అభిమానులందరూ పాలుపంచుకోవాలని బాలయ్య పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News