: మరోసారి భారత్ చేతిలో పాక్ ఘోరపరాజయం
కామన్వెల్త్ క్రీడల్లో భారత హాకీ జట్టు చేతిలో ఘోరపరాజయం పాలైన పాకిస్థాన్ జట్టు మరోసారి ఓటమిపాలైంది. మలేసియాలోని దయా స్టేడియంలో జరుగుతున్న జోహార్ కప్ అండర్ 21 హాకీ మ్యాచ్ లో పాకిస్థాన్ ను భారత జట్టు 6 గోల్స్ తేడాతో చిత్తు చేసింది. ఇది మంచి విజయమే అయినా మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని కోచ్ అభిప్రాయపడ్డారు. కాగా, కామన్ వెల్త్ ఓటమితో సరిహద్దుల్లో కాల్పులు మొదలుపెట్టిన పాకిస్థాన్ ఈ ఓటమిని ఎలా వ్యక్తం చేస్తుందో మరి.