: మహారాష్ట్ర బీజేపీదే...ఎగ్జిట్ పోల్స్ వెల్లడి
మహారాష్ట్రలో ఎన్నికలు ముగియగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉండనున్నాయో తెలిపాయి. ఏబీపీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాదని తెలిపింది. అయితే ఎక్కువ అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. బీజేపీ 127 స్థానాలలోను, శివసేన 77 స్థానాల్లోను పాగా వేస్తాయని, కాంగ్రెస్ 40 స్థానాలను, ఎన్సీపీ 34 స్థానాలతోను సరిపెట్టుకుంటాయని, ఎంఎన్ఎస్ 5 స్థానాల్లో విజయం సాధిస్తే, ఇతరులు 5 చోట్ల విజయం సాధిస్తారని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి.